తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మరోవైపు రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 42 నుంచి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్