ETV Bharat / state

రాగల మూడు రోజులపాటు వర్షాలు..! - telangana weather report

రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణకు వర్షసూచన
తెలంగాణకు వర్షసూచన
author img

By

Published : May 14, 2021, 3:44 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది మరింత బలపడి.. రాగల 24 గంటల్లో తుఫానుగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇదీ చూడండి: తెలంగాణ వాహనాలను రానివ్వమంటూ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.