ETV Bharat / state

Telangana Weather Report: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడురోజులు వర్షాలు - Telangana Weather Report

ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం (Telangana Weather Report) ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న వెల్లడించారు.

Telangana Weather Report
Telangana Weather Report
author img

By

Published : Oct 9, 2021, 5:25 PM IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో (Telangana Weather Report) హైదరాబాద్​తో పాటు నైరుతి జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈరోజు ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉటుందని చెప్పారు.

ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటలలో ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 4- 5 రోజులలో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈరోజు కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు

నగరంలో వర్షం...

హైదరాబాద్​ నగరంలో మళ్లీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీనగర్, హయత్​నగర్, వనస్థలిపురం, చైతన్యపురి, దిల్​సుఖ్​నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, చిక్కడపల్లి, సికింద్రాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బేగంబజార్, సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఇదీ చూడండి: HYDERABAD RAIN ALERT: హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దు: జీహెచ్​ఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.