ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో.. దేశంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు- పరిష్కారాలపై శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ తార్నాక సీఎస్ఐఆర్ - కణ, అణు జీవశాస్త్ర కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అర్చన శివ, శాస్త్రవేత్తలు, ఆచార్యులు పాల్గొన్నారు.
సీసీఎంబీ ప్రాంగణంలో పలు పరిశోధన విభాగాలను వెంకయ్యనాయుడు సందర్శించారు. పని తీరు, పురోగతి, సాధించిన విజయాలపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీఎంబీ - ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. వర్షాభావం, కరవు వల్ల.. వ్యవసాయం లాభసాటిగా లేదని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రఖ్యాత పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు ఆయా సవాళ్ల పరిష్కారంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: సూర్యాపేట 5 మున్సిపాలిటీల్లో 'గులాబీ' ఛైర్మన్లు