రాష్ట్ర రాజధానిలో వానొస్తే చాలు జనాలు భయపడిపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం, ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నాలాల్లో పడి చనిపోతున్నారు. 2016లో కురిసిన భారీ వర్షానికి 200 కాలనీలు నీటి మునిగాయి. వేలమంది కొన్ని రోజులపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెరువులు, వరద కాల్వల ఆక్రమణ ఒక కారణమైతే సరైన మురుగు వ్యవస్థ లేకపోవడం మరో కారణం.
దేళ్ల క్రితం రూ.2867 కోట్ల భారీ వ్యయంతో ప్రణాళిక రచించినా అడుగు ముందుకు పడలేదు. కేవలం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో కొంతవరకు పనులు చేపట్టారు. తరచూ అత్తాపూర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబరు 190 వద్ద వాన నీరు పోటెత్తుతోంది.
ఇదీ చదవండి: ధరణి సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో నేడు సీఎస్ సమీక్ష