ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఝార్ఖండ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఇంటీరియర్ ఒరిస్సా, దక్షిణ చత్తీస్ఘడ్, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం