ETV Bharat / state

'ఓ వైపు చలి.. మరోవైపు వాన'.. కూల్​కూల్​గా హైదరాబాద్..! - ఈరోజు హైదరాబాద్​లో వర్షం

Hyderabad Rains Today : ఓవైపు చలి వణికిస్తోంటే.. అగ్గికి ఆజ్యం పోసినట్లు మరోవైపు వాన ఊపందుకుంది. చలికాలంలో వర్షం ఏంట్రా బాబు అని హైదరాబాద్​ నగరవాసులు వణుకుతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి నగరంలోవర్షం పడుతోంది. చలికి వాన తోడవటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

hyderabad rain effect
హైదరాబాద్​లో వర్షం
author img

By

Published : Jan 6, 2023, 9:27 AM IST

Hyderabad Rains Today: భాగ్యనగరం చిరుజల్లులతో చిత్తడి అవుతోంది. ఓ వైపు చలి.. మరోవైపు చిరుజల్లులతో నగరవాసులు గజగజ వణుకుతున్నారు. గత రెండు రోజుల నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుండగా.. నేడు చిరుజల్లులు కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వేకువజాము నుంచి వర్షం పడుతోంది. ఈ చలికాలంలో వర్షం ఏంట్రా అనుకుంటూ నగరమంతా వణికిపోతోంది.

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​, అమీర్​పేట్​, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్​ రోడ్డు, చింతల్​, బాలానగర్​, సుచిత్ర, కుత్బుల్లాపూర్​, బేగంపేట, తార్నాక్​, హబ్సిగూడ మొదలైన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. ఉదయాన్నే వాన కురుస్తుండటంతో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర పనులపై బయటకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.