ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో 3.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్నిచోట్ల రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇవీ చూడండి: 'దొంగ' తెలివి: సీసీటీవీ వైర్లు కత్తిరించి ఏటీఎం చోరీ