ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు పశ్చిమ విదర్భ, మరఠ్వాడ, దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ సంచాలకులు తెలిపారు.
దక్షిణ అండమాన్ సముద్రం దానిని అనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాలలో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఈ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా మే 13వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈరోజు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఇవీచూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్