ETV Bharat / state

Rain Alert in Telangana: రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు.. బీ అలర్ట్​! - తెలంగాణలో మోస్తరు వర్షాలు

Rain Alert in Telangana: ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

Rain Alert in Telangana
మోస్తరు వర్షాలు
author img

By

Published : Nov 27, 2021, 10:10 AM IST

Rain Alert in Telangana: బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు దక్షిణంగా ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఆ తరవాత అది బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది.

శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్‌జిల్లా సల్కాపూర్‌లో 12.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో శనివారం భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఇవీ చూడండి: Holidays in 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులివే!

rains in hyderabad: హైదరాబాద్​​లో వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయాలు​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.