అల్పపీడన ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో (rains in Telangana) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది (weather report). మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని (rains in Telangana) తెలిపింది.
తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి మర్ధబల్ నుండి తూర్పున బంగాళాఖాతం మీదుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై... ఉపరితల ఆవర్తనం 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం