ETV Bharat / state

ఓరుగల్లులో రూ.380కోట్లతో రైల్వే వ్యాగన్ - kishanreddy

అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

కిషన్‌రెడ్డి
author img

By

Published : Sep 9, 2019, 7:38 PM IST

వరంగల్‌లో 160 ఎకరాల్లో రూ.380 కోట్లతో రైల్వే వ్యాగన్‌ యూనిట్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యాగన్ యూనిట్ ప్రారంభమైతే 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. రైల్వేశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రైల్వే శాఖలోని సమస్యల గురించి అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 500 స్టేషన్లలో ఫ్రీ వైఫై అందుబాటులో ఉందన్నారు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు చెప్పారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న కవర్లు, ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తారని వివరించారు. వ్యాగన్ యూనిట్ పెట్టడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. త్వరలోనే సీఎస్‌తో మాట్లాడి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తానని వెల్లడించారు. చర్లపల్లిలో రైల్వే శాఖ కొత్త టెర్మినల్‌, కాచిగూడలో రైల్వే మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.

ఓరుగల్లులో రూ.380కోట్లతో రైల్వే వ్యాగన్

ఇవీ చూడండి: విక్రమ్​ జాడ కనుక్కోవచ్చు.. బడ్జెట్​ వాస్తవాలను కనుక్కోలేం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.