Railway Minister: రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవలు విస్తరించాలని భాజపా నేతలు చేసిన విజ్ఞప్తికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలను సిద్ధం చేస్తే రైల్వే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో భాజపా కార్యాలయానికి వెళ్లిన మంత్రి... పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్ల ఏర్పాటులో తెలంగాణకు ప్రయోజనం కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డుకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తే ప్రజలకు ప్రయోజకరంగా ఉంటుందని స్వామి గౌడ్ కోరారు. 100 మీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు వెడల్పులో 30 మీటర్లు రైల్వేకు కేటాయిస్తే... ఎంఎంటీఎస్ సేవలు విస్తరించేందుకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. సంబధిత అధికారులతో మాట్లాడి చెబుతానని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే మంత్రికి చెప్పారు.
ఇదీ చూడండి: