గ్రీన్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. చాలా మంది సినీ ప్రముఖులు ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. అందులో భాగంగా బుల్లితెర వ్యాఖ్యాత సుమ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్... తన నివాసంలో పూలమొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని అభిమానులకు పిలుపునిచ్చారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, ఫలక్‌నుమా దాస్ కథానాయకుడు విశ్వక్ సేన్, వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌కు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం