Rahul Gandhi Election Campaign in Telangana : ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలపై సంతకం పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రాహుల్ గాంధీ సంగారెడ్డి జిల్లాలోని ఆంధోల్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Rahul Gandhi on Explian Congress Manifesto : ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది రాహుల్ గాంధీ ప్రజలకు వివరించారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5 లక్షలతో యువ వికాసం అమలు చేస్తామని తెలిపారు. ఈ నగదుతో చదువుకోవచ్చని.. కోచింగ్ తీసుకునేందుకు కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తామని చెప్పారు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతు భరోసా(Rythu Bharosa) ఇస్తామని అన్నారు.
Rahul Gandhi Telangana Tour : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దొరల సర్కార్‌కు, ప్రజల సర్కార్‌కు మధ్య తేడా ఏంటో చూపిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల పాలనను చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఊరట కల్పిస్తామన్నారు. అలానే వారి ఖాతాలో ప్రతి నెలా రూ.2500 వేస్తామని.. రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతుభరోసా కల్పిస్తామన్నారు. కర్షకులకు మరిన్ని ఎన్నో కార్యక్రమాలు అందిస్తామని అన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు.
"ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో కేసీఆర్ చెప్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ దోపిడీ వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది. ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది. ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు."- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకుడు
Rahul Gandhi Meet Students in Hyderabad : శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న కేంద్ర గ్రంథాలయానికి వెళ్లానని.. అక్కడ ఉన్న నిరుద్యోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నానని రాహుల్(Rahul GANDHI) అన్నారు. రాష్ట్రంలో పేపర్ లీక్ అవ్వడం వల్ల యువకులు ఎంతో నష్టపోయామని తమ బాధను వ్యక్తం చేశారని తెలిపారు. ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే.. అవి రద్దు అయ్యాయని విచారం వ్యక్తం చేశారు.
Rahul Gandhi Fire on PM Modi : ప్రధాని మోదీ(PM Modi) తనపై 24 కేసులు పెట్టి.. తన ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్ నుంచి పంపించి వేశారని రాహుల్‌గాంధీ గుర్తు చేశారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్(brs), బీజేపీ(BJP) మధ్య మంచి స్నేహం ఉందని అన్నారు. దిల్లీలో మోదీకి కేసీఆర్ సహకరిస్తారు, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సాయం చేస్తారని ఆరోపించారు. దేశంలో మోదీ.. అదానీకి మాత్రమేనిని అలానే రాష్ట్రంలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్ర చేస్తాయని మండిపడ్డారు.
Rahul Gandhi Public Meeting at Sangareddy : అనంతరం సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభ(Congress Public Meeting)కు హాజరయ్యారు. దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల భూములను కేసీఆర్ లాకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేస్తున్న పాలన కాంగ్రెస్ ఇవ్వడం వల్ల వచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం - నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi Jagtial District Tour : రాహుల్ గాంధీని చూసేందుకు పోటెత్తిన ప్రజలు.. ఫొటోస్ చూశారా