కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాద్ గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పేదలకు.. ఓబీసీ, మైనార్టీ, మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచితంగా బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. శానిటైజర్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్‌కు చెందిన అన్ని విభాగాల నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Nama Nageswara Rao: మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు..