ETV Bharat / state

Rahul Gandhi At Congress Vijayabheri Sabha : '100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికే'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 7:58 AM IST

Rahul Gandhi At Congress Vijayabheri Sabha: విశ్వసనీయతనే అజెండాగా జరిగిన తుక్కుగూడ విజయభేరి సభలో కాంగ్రెస్ నిబద్ధతను ప్రజలకు గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మాటలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నట్లు స్పష్టంచేస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం మధ్య ఆరు హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలపై విమర్శల దాడి చేసిన రాహుల్.. ఆ మూడు పార్టీలు ఒకటేనని పునరుద్ఘాటించారు. విజయభేరి బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. వచ్చే ఎన్నికలకు ఉత్ర్పేరకంగా పనిచేస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

Congress Vijayabheri Sabha
Congress

Congress Vijayabheri Sabha ఆ మూడు పార్టీలు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ కలిసే పనిచేస్తున్నాయి

Rahul Gandhi At Congress Vijayabheri Sabha : కాంగ్రెస్ మాటఇస్తే తప్పదన్న విషయాన్ని హస్తం నాయకులు తుక్కుగూడ విజయభేరి సభా వేదికగా నొక్కిచెప్పే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలతో పాటు సీడబ్యూసీ సభ్యులు సభకు హాజరవగా.. రాష్ట్ర నేతలు భారీగా జనసమీకరణ చేశారు. ఓటర్లను ఆకర్శించేందుకు ఉత్ప్రేరకం లాంటి ఆరు హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ పార్లమెంటరీ అధ్యక్షురాలు సోనియా(Congress Parliamentary President Sonia) ప్రకటించారు.

Congress Six Guarantees in Telangana : తొలుత మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌ లక్ష్యమని సోనియా స్పష్టం చేశారు. తమ వల్లే తెలంగాణ ఏర్పడిందని ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని మాట ఇస్తున్నట్లు ప్రకటించగా.. సభలో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. అనార్యోగ కారణాలతో త్వరగానే సభావేదిక నుంచి సోనియా నిష్క్రమించారు.

CWC Meeting Hyderabad 2023 : తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో విజయంపై సీడబ్ల్యూసీ ధీమా

'మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తాం. మహిళల కోసం రూ.500లకే వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆరు వాగ్దానాలను ప్రకటిస్తున్నాం. ఇందులో మహాలక్ష్మీ మొదటిది. ఆ వాగ్దానాలను అమలు చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో నాసహచరులతో కలిసి నేను భాగస్వామినయ్యా. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కొత్త శిఖరానికి తీసుకెళ్లే బాధ్యత మాపై ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చూడాలనేది నా కల.' - సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Sonia Gandhi At Congress Vijayabheri Sabha 2023 : రాజకీయాల్లో ఎవ్వరితో కొట్లాడుతున్నామో కొట్లాడేపార్టీకి తెలిసి ఉండాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్‌తో రాజీలేని పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ మూడు వేరువేరుగా కనిపించినా కలిసే పనిచేస్తాయని ఆరోపించారు. బీజపీకు అవసరమైనపుడల్లా బీఆర్ఎస్ సహకరించిందని విమర్శించారు. సోనియా ప్రకటించిన ఆరు హామీల గ్యారంటీ కార్డును( Telangana Congress Six Guarantees) తప్పక నెరవేరుస్తామన్న ఆయన.. రాష్ట్ర ఏర్పాటును ఉదాహరించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. కాళేశ్వరంతో లక్ష కోట్లు, ధరణి పోర్టల్‌తో పేదల భూములు కేసీఆర్ లాకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. రైతుబంధు ధనిక రైతులకు ఉపయోగపడుతోందని ఆక్షేపించారు.

CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో రెండోరోజు సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఆ అంశాలపై మరింత విస్తృతంగా సమాలోచనలు

'బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలతో కాంగ్రెస్‌ పోరాడుతోంది. ఆ పార్టీలు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. విపక్ష నేతలపై పెట్టని కేసులు లేవు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసులు లేవు. ఎంఐఎం నేతలపై ఎలాంటి కేసులు లేవు. అవినీతిలో అన్ని రికార్డులను బద్దలు కొట్టినా ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను కేసులు లేవు. బీఆర్ఎస్​ను బీజేపీ బంధువుల సమితిగా పిలవవచ్చు.' -రాహుల్ గాంధీ , కాంగ్రెస్ అగ్రనేత

Mallikarjuna Kharge Speech at Vijayabheri Sabha : మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను.. కేసీఆర్ అప్పులరాష్ట్రంగా మార్చారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjuna Kharge) ఆరోపించారు. రైతు భరోసా ప్రకటించిన ఖర్గే.. తాము చెప్పింది చేసి తీరతామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపుకోసం అంతా ఐక్యంగా కష్టపడాలన్న ఖర్గే.. జనం ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసే తెలంగాణ ఇచ్చిన సోనియా.. ప్రజల భవిత కోసం మళ్లీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చేఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని కోరారు. తుక్కుగూడ సభకు ఊహించిన దాని కంటే ఎక్కువ మంది తరలివచ్చారన్న నేతలు.. అగ్రనేతల పర్యటనతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని వివరించారు.

'రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలురైతులకు ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు అందిస్తాం. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 బోనస్‌ ఇస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఆ హామీలన్నీ వెంటనే నెరవేరుస్తాం. రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు బడ్జెట్‌ ఉండగా.. కేసీఆర్‌ విధానాలతో ప్రస్తుతం దివాళా తీసింది. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి సహా వారి జనాభా మేరకు బడ్జెట్‌ కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు.' -మల్లికార్జున ఖర్గే , ఏఐసీసీ అధ్యక్షుడు

Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!

Revanth Reddy Fires on BRS : 'కేసీఆర్‌, కిషన్‌ రెడ్డి వేర్వేరు కాదు.. కాంగ్రెస్​ సభను అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.