ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణరాజు కచ్చితంగా జైలుకెళ్లడం ఖాయమని.. వైకాపా ఎంపీ నందిగం సురేశ్ వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజుపైనా సీబీఐ కేసులు ఉన్నాయని వివరించారు. జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేశారన్న ఎంపీ నందిగం.. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టేశారని వెల్లడించారు. జగన్ రాముడితో సమానం కాబట్టే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని నందిగం సురేశ్ స్పష్టం చేశారు.
బెయిల్ షరతులను ఉల్లంఘించిన ముఖ్యమంత్రి జగన్ను జైలుకు పంపించి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ వేగంగా జరపాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు.
ఇదీ చదవండీ.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో పిటిషన్