తనను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, ఆయన బంధుమిత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఒకే సమయంలో అక్షరం పొల్లు పోకుండా ఫిర్యాదులు చేశారని వివరించారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విషయం తెలియజేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా విచారణ జరపాలని కోరుతానని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం నుంచి నివేదిక కోరడం తగదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: సీతారామచంద్రస్వామి తలంబ్రాలను నేలపాలు చేశారు..