తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై దర్శకేంద్రుడు రాఘవేందరరావు రాసిన తొలి పుస్తకం 'నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ'. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి చేతుల మీదుగా ఇటీవలే ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతలు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా రాఘవేందరరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని, ఆయన సినిమాల విశిష్టతను గుర్తు చేసుకున్నారు.
ఆద్యంతం నవ్వులు పూయిస్తూ.. సందడిగా సాగిన ఈ వేడుకకు సంబంధించిన 3 నిమిషాల వీడియోను రాఘవేందరరావు బృందం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను త్వరలోనే అభిమానులతో పంచుకోనున్నట్లు తెలిపింది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, లెక్కల మాస్టార్ సుకుమార్‌లు చెరో జట్టుగా ఏర్పడి పుస్తకావిష్కరణ వేడుకను మరింత సరదాగా మలిచారు.
ఇవీ చూడండి..
ప్రశాంత్‌నీల్ మల్టీవర్స్.. 'కేజీఎఫ్ 2' సీక్వెల్స్‌గా 'సలార్', 'ఎన్టీఆర్ 31'?
విజయ్‌తో లిప్‌లాక్!.. నిన్ను తలచుకుంటే నా పెదవులపై చిరునవ్వు: సమంత