Radio Remote Units Theft Gang Arrest Hyderabad : ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఆ యువకుడు. ఇదే క్రమంలో అవసరాల కోసం అప్పులు చేశాడు. వాటిని ఎలాగైనా తీర్చాలని అనుకున్నాడు. ఉద్యోగం మానేసి తాను పనిచేస్తున్న సెల్‌టవర్ సిగ్నల్ రిమోట్ రేడియో యూనిట్లను చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ప్రణాళికలు రచించి, మరో ఇద్దరితో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. ఇలా రాష్ట్రంలోని సెల్‌టవర్‌ల వద్ద సిగ్నల్ రేడియో రిమోట్ యూనిట్లను చోరీ చేసి, వాటిని విక్రయించడం మొదలు పెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
సెల్‌టవర్ సిగ్నల్ రిమోట్ రేడియో యూనిట్లను చోరీ చేస్తున్న (Radio Remote Units) ముఠాను, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ సాయిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా చెందిన ప్రవీణ్ ఓ సెల్‌టవర్లకు సంబంధించిన టెక్నికల్ సంస్థలో ఉద్యోగం చేరాడు. ఈ సమయంలో అప్పులు భారీగా చేయడంతో వాటిని ఎలాగైనా తీర్చాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం అతని పనికి సంబంధించిన సెల్‌టవర్ సిగ్నల్ రిమోట్ రేడియో యూనిట్లను చోరీ చేయాలని పథకం రూపొందించాడు.
అర్ధరాత్రి దొంగల హల్‌చల్ - పలు దుకాణాల్లో నగదుతో పాటు సరుకులు చోరీ
Cell Tower Radio Remote Units Theft Gang Arrest : ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రధాన నిందితుడు ప్రవీణ్ తనకు పరిచయం ఉన్న తరుణ్, అఖిల్‌తో ముఠాను ఏర్పరచుకున్నాడు. ఇలా ఈ ముఠా రాష్ట్రంలో సిగ్నల్ రిమోట్ రేడియో యూనిట్లను చోరీ చేసి విక్రయించేవారు. ఇలా మాణికేశ్వర్‌నగర్‌లో రిమోట్ రేడియో యూనిట్లను దొంగిలించారు. వెంటనే సెల్‌టవర్ సిబ్బంది అక్కడ సిగ్నల్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కళ్ల ముందే చోరీ చేస్తున్నా కనిపెట్టలేకపోయారు - ఈ కి'లేడీ' ఎలా తప్పించుకుందో తెలుసా?
నిందితులపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు : ప్రవీణ్ చోరీ చేసిన రిమోట్ రేడియో యూనిట్లను హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌కు చెందిన అబ్దుల్ హైమద్‌కు విక్రయిస్తున్నారు. అతడు దిల్లీకి చెందిన మరో వ్యక్తికి అమ్ముతున్నట్లు గుర్తించాం. నిందితులపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, కరీంనగర్, సిద్దిపేట పరిధిలో 8 కేసులు ఉన్నాయి. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
నిందితుల నుంచి రూ.45 లక్షలు విలువ చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ సాయిశ్రీ (DCP Saisri) తెలిపారు. చోరీ సొత్తులో కొంత భాగం మాత్రమే స్నేహితులకు ఇచ్చేవాడని ప్రవీణ్ విచారణలో ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. మిగతా నగదును అతను తీసుకునేవాడని డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.
శామీర్‌పేట్ ఎల్లమ్మ ఆలయంలో చోరీ - సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు