ETV Bharat / state

'నగల దుకాణానికి కన్నం.. యజమానికి పంగనామం '

యజమానికి నమ్మకస్తుడిగా ఉంటూ... నగల దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడిన ఘటన నేరెడ్​మెట్​లో చోటు చేసుకుంది. రాచకొండ పోలీసులు నిందితుడిని పట్టుకుని... సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

rachakonda cp mahesh bhagawath press meet
'నగల దుకాణంలో పని చేసే వ్యక్తే... దొంగతనానికి పాల్పడ్డాడు'
author img

By

Published : Jun 19, 2020, 5:50 PM IST

హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లోని ఓ నగల దుకాణంలో ఈ నెల 12న చోరి జరిగింది. భారీ మొత్తంలో వెండి, బంగారు నగలు పోవడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్​గా తీసుకుని ఛేదించారు. దుకాణంలో పనిచేసే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

''పప్పురాం దేవాసి అనే వ్యక్తి రెండేళ్లుగా నగల దుకాణంలో పనిచేస్తూ... యజమాని నమ్మకాన్ని పొందాడు. లాక్​డౌన్ నేపథ్యంలో రోజూ రాత్రి ఎనిమిది గంటలకు దుకాణానికి తాళాలు వేసి యజమానికి అందించేవాడు. కానీ 12వ తేదీన రాత్రి దుకాణానికి తాళాలు వేయకుండా... షట్టర్ మూసివేసి... యజమానికి తాళాలు ఇచ్చాడు. అనంతరం నలుగురి సాయంతో దుకాణంలో చోరి చేశాడు. ఉదయాన్నే వచ్చిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న క్లూస్ టీం... ఘటనా స్థలంలోని ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. పప్పురాం అతని సోదరుడు, రాజస్థాన్​కు చెందిన మరో ఇద్దరు నగలు అపహరించారు.''

-రాచకొండ సీపీ, మహేశ్ భగవత్

నిందితుల నుంచి 47లక్షల27వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, ట్రాలీని స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్‌ భగవత్ తెలిపారు. వారంలోగా కేసును ఛేదించామని... దీనికి కృషి చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి: 'ఫలితాలు చూసుకోకుండానే.. అనంత లోకాలకు వెళ్లిపోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.