హైదరాబాద్ నేరేడ్మెట్ సైనిక్ పురికి చెందిన కుట్టి అడస్సా పాల్‌కు ఇద్దరు పిల్లలు. ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. ఇవాళ ఆమె 60వ పుట్టిన రోజు. కన్నతల్లి జన్మదిన వేడుకలను ఘనంగా చేయాలనుకున్న వారికి లాక్డౌన్ కారణంగా ఇంటికి రాలేని పరిస్థితి. ఇంట్లో ఒక్కతే ఉంటూ... తమపై బెంగ పెట్టుకున్న తమ తల్లికి వారి తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి.. ఆమెకు మనోధైర్యం నింపాలని ఆమె కుమారుడు ఆషార్ పాల్ తల్లురి... మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తిని అభ్యర్థించాడు.
వారి కోరికపై వెంటనే స్పందించిన డీసీపీ రక్షిత మూర్తి... వారి ఇంటికి వెళ్లి ఆ మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని సిబ్బందికి ఆదేశించారు. డీసీపీ ఆదేశాలపై నేరేడ్మెట్ సీఐ నరసింహ వారి ఇంటికి వెళ్లి ఆమెకు పుట్టినరోజు శుభాకాక్షలు తెలిపి పాట పాడారు. కాసేపు ఆమెతో మాట్లాడి ధైర్యాన్ని నింపారు. తన పుట్టినరోజు నాడు ఈ ఊహించని పరిణామానికి ఆ తల్లి సంతోషంగా గడిపింది.
ఇదీ చూడండి: సీఎంఆర్ఎఫ్కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు