రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. తమ పరిధిలో 30 వార్డులు ఉన్నాయని అన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ముగ్గురు పోలీసులు ఉంటారని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక ఎస్సైతో పాటు నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 4,500మంది రోహింగ్యాల బయోమెట్రిక్‌లు సేకరించామని వెల్లడించారు.
మొత్తం 8వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని చెబుతున్న సీపీ మహేశ్ భగవత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి: కేంద్ర కేబినేట్ కార్యదర్శి సమీక్షలో సీఎస్, డీజీపీ