రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరోనా మృతులను తరలించేందుకు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 'ఫీడ్ ద నీడీ' ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'లాస్ట్ రైడ్ సర్వీస్'ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
కరోనాతో చనిపోయిన వారిని తరలించేందుకు ఫీడ్ ద నీడీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశామని మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇప్పటికే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో ఈ వాహనాలను నడుపుతున్నామని తెలిపారు. కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాలను తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉండడం లేదన్న ఆయన.. అందుకోసమే ఈ సేవలు ప్రారంభించినట్లు వివరించారు.
అవసరం ఉన్న వారు 7995404040 నెంబర్‌కి ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సీపీ పేర్కొన్నారు. 9490617234 రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిస్తే.. వాహనం మీ దగ్గరకే వస్తుందని తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ లాస్ట్ రైడ్ వాహనాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: 'మీరు ఇచ్చే ప్లాస్మాతో మరి కొన్ని ప్రాణాలు నిలబడతాయి'