పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. నేరేడ్ మెట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో... ఐఐసీటీ, సిప్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు వేల మాస్కులను అందించారు.
ప్రత్యేకంగా రూపొందించిన 4 లేయర్ మాస్కులు ఇచ్చినట్లు సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసే 10 వేల మంది ఆర్కేఎస్పీ, సంఘమిత్ర వాలంటీర్లకు ఇస్తామని మహేశ్ భగవత్ వెల్లడించారు.
ఇదీ చూడండి: పోలీసులు కస్టడీలో కిడ్నాపర్లు.. కొనసాగుతోన్న విచారణ