రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు సీపీ మహేష్ భగవత్ రాచకొండ కమిషనర్ కార్యాలయంలో మూడు మొక్కలను నాటి మరో నలుగురికి ఛాలెంజ్ చేశారు. అందులో భాగంగా సినీ హీరో మహేష్ బాబు, నటుడు షియాజీ షిండే, పుణె పోలీసు కమిషనర్ వెంకటేశం, పోచారం ఇన్ఫోసిస్ డీసీ హెడ్ మనిషా సాబులకు ఛాలెంజ్ విసిరారు.
ఈ ఛాలెంజ్‌ను వెంటనే స్వీకరించిన నటుడు షియాజీ షిండే మంబైలోని ఆర్ఐ కాలనీలో రేపు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మిగతా ముగ్గురు కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించనున్నారని మహేష్ భగవత్ తెలిపారు.
ఇదీ చూడండి : వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి