Rachakonda CP Counselling to Rowdy Sheeters : రౌడీషీటర్స్ ఈ కొత్త సంవత్సరం సందర్భంగా తమలో మార్పు తెచ్చుకొని నేర ప్రవృత్తిని మార్చుకుని సమాజంలో కలవాలని, సాధారణ పౌరుల్లాగా నూతన జీవితం ప్రారంభించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) సూచించారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి ఎదుగుతారని, అందుకని రౌడీషీటర్లు(Rowdy sheeters) నేర ప్రవృత్తిని వదిలి తమ పిల్లల భవిష్యత్తును ఉన్నత శిఖరాల వైపు నడిపించేలా బాధ్యత వహించాలని ఆయన సూచించారు. నేరస్థులు తొందరపాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్ టెస్టులు : రాచకొండ సీపీ
Rachakonda CP Sudheer Babu : డాక్టర్ల బిడ్డలు డాక్టర్లు అవుతున్నారని, పోలీసు ఆఫీసర్స్ పిల్లలు పోలీసులు అవుతున్నారని, రౌడీ షీటర్స్ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్థులుగా తయారవుతారని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నామని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్‌గా ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
భూకబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. మార్పు కోసం ప్రయత్నించే వారికి సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామని, పోలీసులు రౌడీషీటర్ల నుంచి కోరుకునేది మార్పు మాత్రమేనన్నారు. తమ చుట్టు జరిగే నేరాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించే వారికి, మార్పు వచ్చిన వారికి పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు.
రౌడీషీట్ రికార్డులో వారు చేసే మంచి పని కూడా ఎంటర్ చేస్తామని, మార్పు పూర్తిగా వస్తే రౌడీషీట్ తొలగించేందుకు అవకాశం కూడా ఉందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గతాన్ని మరచిపోయి మంచి మనసుతో ముందడుగు వేయాలని అందులో వారి కుటుంబ పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జైలులో గడిపే వారికంటే నేరాలకు పాల్పడకుండా సమాజంలో మంచి పౌరులుగా ఉండే వారికి కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరైన రౌడీ షీటర్లు పోలీస్ శాఖ వారు తమలో మార్పు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పై సీపీ సంతోషంగా ఉందని ఆయన వివరించారు.
రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : సీపీ అవినాశ్ మహంతి
న్యూ ఇయర్ వేళ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - 10 తర్వాత ఈ రూట్లలో నో ఎంట్రీ