ETV Bharat / state

ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి - మహిళలపై నేరాలు తగ్గాయి : రాచకొండ సీపీ - వార్షిక నేర నివేదిక

Rachakonda Commissionerate Annual Crime Report 2023 : రాచకొండ కమిషనరేట్​కు సంబంధించి ఈ ఏడాది వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్​ విడుదల చేశారు. ఈ ఏడాదిలో సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయన్న ఆయన, మహిళపై నేరాలు 6.65 శాతం తగ్గాయని తెలిపారు. ఈ ఏడాది రాచకొండలో 16,594 కేసులు నమోదయ్యాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 16 శాతం పెరిగింది.

Rachakonda Commissionerate Annual Crime Report 2023
Rachakonda Commissionerate
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 1:12 PM IST

Updated : Dec 27, 2023, 5:12 PM IST

ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి - మహిళలపై నేరాలు తగ్గాయి : రాచకొండ సీపీ

Rachakonda Commissionerate Annual Crime Report 2023 : రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే 6.86 శాతం నేరాలు పెరిగాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను ఇవాళ ఆయన విడుదల చేశారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయన్న సీపీ, మహిళపై నేరాలు 6.65 శాతం తగ్గాయని వెల్లడించారు. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు(Cyber Cases) నమోదయ్యాయని సీపీ తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంక్ ఖాతాలో రూ. 89.92 లక్షల నగదును ఫ్రీజ్ చేసి పోలీసులు బాధితులకు అప్పగించారు. ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ ద్వారా 200 మంది చిన్నారులను పోలీసులు కాపాడారని సీపీ వివరించారు.

Annual Crime Report in Rachakonda 2023 : మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 16,594 కేసులు నమోదయ్యాయి. అలాగే గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు(Road Accident Deaths) 16 శాతం పెరిగాయని చెప్పారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 71 మంది బాధితులకు విముక్తి కలిగించామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన 8,758 ఫిర్యాదుల్లో 4,643 పరిష్కారించామని తెలిపారు. కమిషనరేట్ పరిధి నేరాల్లో రూ.12.77 కోట్లు రికవరీ చేశామన్నారు. గతేడాదితో పోలిస్తే రికవరీ రేటు 2 శాతం పెరిగిందని సీపీ సుధీర్​ బాబు వివరించారు.

యాక్సిడెంట్​లు తగ్గాయి, రేప్​ కేసులు పెరిగాయి - హైదరాబాద్ కమిషనరేట్​ వార్షిక నేర నివేదిక విడుదల

'రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే 6.86శాతం నేరాలు పెరిగాయి. రాచకొండ పరిధిలో సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయి. మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయి. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదయ్యాయి. గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు నమోదు, 972 మంది అరెస్టు చేశాం. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. 20 కేసుల్లో నిందితులకు జీవితఖైదు పడింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16,594 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో 633 మంది మృతి, 3,205 మందికి గాయాలయ్యాయి. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం పెరిగాయి.' -సుధీర్ బాబు, రాచకొండ సీపీ

రాచకొండ పరిధిలో వార్షిక నేరాల వివరాలు : మహానగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో కఠిన నిర్ణయాలు చేపడుతున్న పోలీసులు ఈ ఏడాది మత్తు పదార్ధాలకు సంబంధించి 282 కేసుల్లో 698 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో విదేశీయులు, అంతర్రాష్ట్ర నేరస్థులు(Interstate Criminals) కూడా ఉన్నారు. 12 మంది పై పీడీ చట్టం ప్రయోగించారు. 5882 కిలోల గంజాయి, 6.55 లీటర్ల హష్‌ ఆయిల్‌, 377 గ్రాములు హెరాయిన్‌ సహా ఇతర మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​లో న్యూయర్​ వేడుకలకు రాచకొండ సీపీ హుకుం - యువత జరభద్రం ఇక

బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమింగ్​కు సంబంధించి 188 కేసుల్లో 972 మందిని అరెస్టు చేశారు. రూ. 1.90 కోట్ల రూపాయల నగదు సీజ్‌ చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని నేరాల్లో రూ. 21.66 కోట్ల నష్టం జరిగితే అందులో రూ. 12.77 కోట్లు స్వాధీనం చేసుకోగా, గత ఏడాదితో పోలిస్తే 2 శాతం సొత్తు స్వాధీనం శాతం పెరిగింది. 21 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. కమిషనరేట్‌ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 16594 మంది పై కేసులు నమోదు చేయగా, వీరిలో 271 మంది జైలు శిక్ష పడింది.

న్యాయస్థానం వీరికి రూ. 3.89 కోట్ల జరిమానా విధించింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఏడాది 8758 ఫిర్యాదులు రాగా, వాటిలో 4643 ఫిర్యాదులను పోలీసులు పరిష్కరించారు. భవిష్యత్తులో మాదకద్రవ్యాలను(Drugs) పూర్తిగా కట్టడి చేసే దిశగా పనిచేస్తామని, పెరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని, నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తామని సీపీ తెలిపారు.

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది : సైబరాబాద్ సీపీ

అంతరాష్ట్ర గంజాయి​ ముఠా అరెస్టు - రాష్ట్రాన్ని డ్రగ్స్​ రహిత దిశగా చర్యలు

Last Updated : Dec 27, 2023, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.