ETV Bharat / state

8నెలల తర్వాత రేస్​క్లబ్​ ప్రారంభం... యజమానులకే అనుమతి - ఎనమిది నెలల తర్వాత రేస్ క్లబ్ ప్రారంభం

కొవిడ్ కారణంగా మార్చి 23న మూతపడిన హైదరాబాద్ రేస్​ క్లబ్​ను ఈ నెల 19 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. వైరస్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నట్లు రేస్ క్లబ్ ప్రతినిధి వీరేంద్ర ఖాజా తెలిపారు. గుర్రాల యజమానులకు మాత్రమే అనుమతి ఉందని, వీక్షకులకు లేదని స్పష్టం చేశారు.

race club re open from november 19 in hyderabad
8నెలల తర్వాత రేస్​క్లబ్​ ప్రారంభం... యజమానులకే అనుమతి
author img

By

Published : Nov 17, 2020, 6:52 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23న మూతపడిన హైదరాబాద్ రేస్‌క్లబ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆదేశాలతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 19న తిరిగి ప్రారంభించనున్నట్లు రేస్ క్లబ్‌ ప్రతినిధి వీరేంద్ర ఖాజా ప్రకటించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కూ అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు. రేస్‌లో పాల్గొనే 100 గుర్రాల యాజమానులకు మాత్రమే అనుమతి ఉందని... లైవ్‌ రేస్‌ టైమ్‌లో వీక్షకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

కరోనా కారణంగా ఈ 8 నెలలు మూతపడిన హైదరాబాద్ రేస్‌క్లబ్‌కు రూ.15కోట్ల నష్టం వచ్చిందని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: సుప్రీంకోర్టు, హైకోర్టుపై పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.