ETV Bharat / state

'ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలి'

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు సమస్యలపై సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషిని కలిసి పరిష్కరించాలని కోరారు.

'ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలి'
author img

By

Published : Aug 1, 2019, 10:41 PM IST

ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య ఆరోపించారు. వివిధ శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సీఎస్​కు అందజేసినట్లు వెల్లడించారు. నూతనంగా ప్రకటించిన జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్​ కౌన్సెలింగ్​లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని... అందువల్ల 262 ఎంబీబీస్​ సీట్లను విద్యార్థులు కోల్పోయారన్న విషయాన్ని సీఎస్​ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

'ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలి'
ఇదీ చూడండి: 'నిరుద్యోగ యువతకు కేఫ్​ల ద్వారా ఉపాధి కల్పన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.