బహుజన రాజ్యం రావడానికి నిర్మాణాత్మకమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బహుజన రాజ్యం వస్తే కలిగే ప్రయోజనాలపై బహుజనుల్లో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ డైరీ, నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.
బహుజన రాజ్యం రావడం వల్ల విద్య, వైద్య, ఉద్యోగ పరంగా ప్రయోజనాలు కలుగుతాయని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఓటు అనే ఆయుధంతో ఈ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. నోటుకు ఓటు అమ్ముకోవద్దని ఆయన కోరారు.
ఇదీ చదవండి: భరత్పూర్ దొంగల సైబర్ వల.. చిక్కితే విలవిల