బీసీల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని వెనుకబడిన కులాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.2,900 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ హైదరాబాద్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్లో మంత్రి హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
బీసీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాల కోసం రూ.5వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని కృష్ణయ్య కోరారు. 12 బీసీ కులాల ఫెడరేషన్లకు ఒక్కోదానికి రూ.200 కోట్లు కేటాయించాలన్నారు. ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదివే బీసీ/ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించి... విదేశీ విద్య కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: యమలీల: 'ఎన్నాళ్లు ఈ దొంగ బతుకు?'