ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడిలో ఆయన పాల్గొన్నారు.
కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలను బలోపేతం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం విద్యావ్యవస్థను బలహీనం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని... లేనిపక్షంలో మంత్రులు, ఎమ్మెల్యేలను తిరగకుండా అడ్డుకుంటామని కృష్ణయ్య హెచ్చరించారు.
మొత్తం రెండు లక్షల 50 వేల పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని కృష్ణయ్య కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలను బలోపేతం చేసే కుట్రలో భాగంగా... విద్యావ్యవస్థను బలహీనం చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చూడండి : గత రెండున్నర నెలల్లో తగ్గిన కొవిడ్ మరణాలు