ETV Bharat / state

క్వాంటమ్​ కంప్యూటర్ల పరిశోధనకు వేదికవుతోన్న హైదరాబాద్​ - google

హైదరాబాద్​ మరో ప్రతిష్ఠాత్మకమైన ఐటీ ప్రాజెక్ట్​కు వేదికైంది. సూపర్​ కంప్యూటర్లు వేల సంవత్సరాలు చేసే పనిని కేవలం నిమిషాల్లో చేసే క్వాంటమ్​ కంప్యూటర్లపై నగరంలోని ఏఆర్సీలో పరిశోధన జరుగుతోంది. ప్రస్తుతం సైద్ధాంతిక స్థాయిలో ఉన్న ఈ ప్రాజెక్ట్​ త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అధికారులు చెబుతున్నారు.

QUANTUM COMPUTING PROJECT IN HYDERABAD ARCI
author img

By

Published : Oct 26, 2019, 9:22 PM IST

Updated : Oct 26, 2019, 10:11 PM IST

ప్రపంచంలో అతిపెద్ద సూపర్ కంప్యూటర్... పది వేల సంవత్సరాలు పనిచేస్తే అయ్యే టాస్క్​ను తమ కంప్యూటర్ కేవలం 3 నిమిషాల 20 సెకన్లలో చేసిందని గూగుల్ ప్రకటించింది. నేచర్ అనే ఒక సైంటిఫిక్ జర్నల్​లో ప్రచురితమైన పేపర్లో ఇది తమ సంస్థలో ఓ కీలక మైలు రాయిగా వర్ణించింది. ఇలాంటి పనులు చేసే వాటిని క్వాంటమ్ కంప్యూటర్లు అంటారు. హైదరాబాద్​లోని ఇంటర్నేషనల్ అడ్వన్స్​డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్​లో క్వాంటమ్​ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోందని ఏఆర్సీఐ డైరెక్టర్​ డా. జీ. పద్మనాభం తెలిపారు. వేల కోట్ల రూపాయల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును దేశంలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికైతే... క్వాంటమ్​ మెకానిక్స్​పై సవివరమైన ప్రణాళిక తయారవుతోందన్నారు. రిపోర్టు పూర్తి కాగానే... వెంటనే ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని పద్మనాభం తెలిపారు.

క్వాంటమ్​ కంప్యూటర్ల పరిశోధనకు వేదికైన హైదరాబాద్​

ఇవీ చూడండి: హుజూర్​నగర్​ నియోజకవర్గంపై కేసీఆర్​ వరాల జల్లు

Intro:Body:TG_HYD_57_26_Quantum_Computing_in_india_Arci_director_ 7202041

ప్రపంచంలో అతిపెద్ద సూపర్ కంప్యూటర్ పది వేల సంవత్సరాలు పనిచేస్తే అయ్యే టాస్క్ ను తమ కంప్యూటర్ కేవలం 3 నిమిషాల 20 సెకన్లలో చేసిందని గూగుల్ ప్రకటించింది. నేచర్ అనే ఒక సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురితమైన పేపర్లో దీనిని ఒక కీలక మైలు రాయిగా వర్ణించింది. ఇలాంటి పనులు చేసే వాటిని క్వాంటమ్ కంప్యూటర్లు అంటారు. సూపర్ కంప్యూటర్లే కొన్ని వేల సంవత్సరాలు కష్టపడితే అయ్యే ఈ టాస్క్ను సాధారణ కంప్యూటర్లు చేయలేవు.

అయితే మన దేశంలో క్వాంటమ్ కంప్యూటర్లపై పరిశోధన ఏ స్థాయిలో ఉంది? భవిష్యత్తులో ఎలాంటి పరిశోధన కొనసాగనుంది.? ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది. ? తదితర విషయాలపై హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ అడ్వన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ఏఆర్సీఐ) డైరెక్టర్, డా. జీ. పద్మనాభం ఈటీవీ భారత్ తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ఈ విషయాలు తెలుసుకుందాం….

బైట్ : డా.జీ పధ్మనాభం, ఏఆర్సీఐ డైరెక్టర్.
Conclusion:
Last Updated : Oct 26, 2019, 10:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.