ETV Bharat / state

Hyderabad police: నా పతకం పోలీస్‌ సేవలకు అంకితం: పీవీ సింధు - pv sindhu latest news

విశ్వ క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన తెలుగుతేజం పీవీ సింధు (PV SINDHU)ను హైదరాబాద్​ కమిషనరేట్​ పోలీసులు ఘనంగా సన్మానించారు. సీపీ అంజనీకుమార్ ఆమెకు​ పుష్పగుచ్ఛం అందించి.. శాలువాతో సత్కరించారు.

PV SINDHU: 'ఒలింపిక్స్​ పతకం పోలీసుల సేవకు అంకితం'

author img

By

Published : Aug 10, 2021, 5:51 PM IST

Updated : Aug 10, 2021, 7:17 PM IST

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్యం సాధించిన స్టార్​ షట్లర్ పీవీ సింధును హైదరాబాద్​ కమిషనరేట్​ పోలీసులు ఘనంగా సన్మానించారు. కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్​, అదనపు డీఐజీలు శిఖా గోయల్, అనిల్​ కుమార్​ తదితర ఉన్నతాధికారులు కరతాళ ధ్వనులు చేస్తూ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా 'ద సెకండ్ వేవ్' పుస్తకాన్ని సింధు ఆవిష్కరించారు. రెండో విడత లాక్​డౌన్ సందర్భంగా నిర్వహించిన విధులకు సంబంధించిన వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సింధును పుష్పగుచ్ఛం అందించి సీపీ అంజనీకుమార్​ ఆహ్వానించారు.

పీవీ సింధుతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు

లాక్​డౌన్​ సమయంలో పోలీసులు ఎంతో కష్టపడి పని చేశారని పీవీ సింధు కొనియాడారు. ప్రాక్టీస్ కోసం స్టేడియానికి వెళ్లడానికి ఎంతో సహకరించారని.. పాస్‌ జారీ చేసి తనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ క్రీడల్లో తాను గెలిచిన కాంస్య పతకాన్ని పోలీసుల సేవకు అంకితం చేస్తున్నానని స్పష్టం చేశారు.

ది సెకండ్​ వేవ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన పీవీ సింధు

బ్యాడ్మింటన్​పై తనదైన ముద్ర..

గత ఐదేళ్లుగా బ్యాడ్మింటన్ క్రీడపై పీవీ సింధు తనదైన ముద్ర వేశారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రశంసించారు. ఫిట్​నెస్​ను కాపాడుకుంటూ.. వరుసగా రెండు ఒలింపిక్స్​లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. ఇది పీవీ సింధు ప్రతిభకు నిదర్శనమని అంజనీకుమార్ కొనియాడారు. కార్యక్రమంలో సింధు తండ్రి రమణ, కమిషనరేట్​ పరిధిలోని అన్ని విభాగాల పోలీసులు పాల్గొన్నారు.

రూ.30 లక్షల నగదు బహుమతి..

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు.. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. ఆ రాష్ట్ర సీఎం జగన్‌, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రూ.30 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమెకు అందించారు.

సంబంధిత కథనాలు..

PV SINDHU: 'వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యం'

PV SINDHU: 'దేశానికి పతకం అందించడం నా అదృష్టం'

Pv Sindhu: శంషాబాద్​ విమానాశ్రయంలో సింధుకు గ్రాండ్ వెల్​కం

GOVERNOR: 'నేటితరం యువతకు పీవీ సింధు స్ఫూర్తిదాయకం'

Hyderabad police: నా పతకం పోలీస్‌ సేవలకు అంకితం: పీవీ సింధు

Last Updated : Aug 10, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.