ETV Bharat / state

PV Sindhu on Cyber Crime: 'నేనూ సైబర్ ట్రోలింగ్‌ ఎదుర్కొన్నా'

PV Sindhu on Cyber Crime: మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పాల్గొన్నారు. విద్యార్థులను సైబర్ వారియర్స్‌గా తీర్చిదిద్దడం పట్ల పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు.

PV Sindhu
PV Sindhu
author img

By

Published : Jan 29, 2022, 9:43 PM IST

PV Sindhu on Cyber Crime: సైబర్ నేరాల బారిన పడిన మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని... తాను కూడా సైబర్ బుల్లింగ్, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నానని ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి... నివారణ చర్యలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులను సైబర్ వారియర్స్‌గా తీర్చిదిద్దడం పట్ల పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు.

కొవిడ్ కారణంగా రెండేళ్లుగా అంతర్జాల వినియోగం పెరిగిందని... దాంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయని పీవీ సింధు తెలిపారు. పిల్లలు కంప్యూటర్లు, చరవాణిలు ఉపయోగించేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలని ఆమె సూచించారు. మహిళల భద్రతకు షీటీమ్‌లు ఎంతో కృషి చేస్తున్నాయని... సైబర్ నేరాల బారిన పడే బాధితుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేయాలని పీవీ సింధు కోరారు. నిరంతరం శ్రమించడం, అనుకున్న లక్ష్యం సాధించాలనే తపనతోనే ఈ స్థాయికి ఎదిగానని పీవీ సింధు విద్యార్థులకు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

నిత్యం వ్యాయామం చేయాలని.. శరీరానికి, మనసుకు అదనపు ఉల్లాసం లభిస్తుందని ఆమె తెలిపారు. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు, ఒక మహిళా ఉపాధ్యాయురాలికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామని అదనపు డీజీ స్వాతిలక్రా తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది ఉపాధ్యాయురాళ్లు, 3,500 విద్యార్థినిలకు ఈ శిక్షణ ఇప్పించామని స్వాతి లక్రా వెల్లడించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.