పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా నియమితులైన డాక్టర్ వంగూర్ రవీందర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో పశు వైద్యవిద్య విస్తృతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వర్సిటీ పరిపాలన భవనం వద్ద... విశ్వవిద్యాలయ సిబ్బంది, ఉద్యోగులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
అంతకు ముందుకు ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే వర్సిటీలో డీన్, ఇంఛార్జి రిజిస్ట్రార్ వంటి వివిధ హోదాల్లో పనిచేసిన రవీందర్‌రెడ్డి.... ఉపకులపతిగా పగ్గాలు చేపట్టటం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మత్స్య, పాడి కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని డాక్టర్ రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.