కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చిందని పంజాబ్‌కు చెందిన ఇద్దరు రైతు బిడ్డలు మజుందర్ సింగ్, సుఖ్ జందర్ సింగ్‌లు పేర్కొన్నారు. పంజాబ్ నుంచి బయలుదేరిన ఆ ఇద్దరు దేశంలోని అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ... చట్టాలతో కలిగే నష్టాలను వివరిస్తున్నారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు.
చట్టాల వలన రైతులకు కలిగే నష్టాల గురించి విద్యార్థులతో చర్చించారు. ఇప్పటి వరకు 15 రాష్ట్రాలలో పర్యటించామని తెలిపారు. వెళ్లిన ప్రతిచోట రైతు చట్టాల గురించి వివరిస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి: కాసేపట్లో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష