గోదావరికి వరదనీరు వచ్చిన తర్వాత సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి వచ్చే ఇలస, పులస చేపగా మారుతుంది. గతంలో జులై వచ్చేసరికి పులసలు విపరీతంగా దొరికేవి. గోదావరిలో వరదనీరు రాకతో పులస చేపల లభ్యత ఎక్కువయ్యేది. ఈ సారి వరద ఉద్ఢృతంగా ప్రవహిస్తున్నా.. పులస మాత్రం కానరావడం లేదు. జాలర్లు వలలతో నిరీక్షిస్తున్నా... అశించిన స్థాయిలో దొరకడం లేదు. పులస కోసం జాలర్లు ఎంతలా వేచి చూస్తారో.. భోజన ప్రియులు అంతకంటే ఎక్కువే నిరీక్షిస్తారు. అలాంటిది ఈ ఏడాది పులసలు ఆశించినంతగా చిక్కకపోవడంతో జాలర్లు, భోజన ప్రియులు ఇరువురు నిరాశ చెందుతున్నారు.
ఇదీ చదవండి.. చేపల వేట... ఇదొక ఆదాయ బాట