ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పులస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వరదల సమయంలో వచ్చే పులస చేపలు తినాలని ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే ఈ చేపల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. వరదల్లో పులస చేపలు రావటంతో.. గౌతమి వంతెన వద్ద జాతీయ రహదారిపై వీటిని అమ్ముతున్నారు. ప్రయాణికులు ఆగి మరీ వీటిని కొనుక్కుంటున్నారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ చేపలు దొరకటంతో గిరాకీ బాగా ఉంటుంది. స్థానికులే కాక ఇతర ప్రాంతాలవారు గోదావరి జిల్లాలకు వచ్చి మరీ వీటిని తీసుకెళ్తుంటారు.
ఇదీ చూడండి : అమ్మ నీది ఎంత పెద్ద మనసు..