యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫెలోషిప్లు మంజూరు చేశారంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ పీహెచ్డీ అభ్యర్థి కె.శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్ ఆరోపించారు.
పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ, సీబీఐ, ఓయూ, కేయూలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గడువు విధించింది.