కరోనా రెండో దశ దృష్ట్యా.. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. రాత్రి 8 గంటల తరువాత దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని వైన్‌షాప్‌లు సాయంత్రం నుంచే మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి.
జనాలు అధిక సంఖ్యలో దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. మాస్క్, భౌతికదూరం లాంటి నియమాలేవి పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ.. నువ్వా, నేనా అన్న రీతిలో మందు కోసం పోటీ పడుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46మరణాలు