కరోనా వైరస్ పట్ల విపరీతంగా ఒత్తిడికి గురి కావద్దని.. అలాగే నిర్లక్ష్యం కూడా చేయవద్దని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఎంఎస్ రెడ్డి చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు నెలకొన్నందున.. ఆత్రుత, కుంగుబాటు వంటివి కొంత పెరగడం సహజమని.. అయితే ఎలాంటి పరిస్థితినైనా అధిగమించే శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందన్నారు. శారీరక వ్యాయామం, సంగీతం వినడం, పుస్తకాలు చదవటం వంటి అలవాట్లతో ఒత్తిడిని జయించవచ్చంటున్న డాక్టర్ ఎంఎస్ రెడ్డితో మా ప్రతినిధి నగేష్ చారి ముఖాముఖి.
ఇదీ చూడండి: వైద్యులపై దాడి హేయమైంది.. చర్యలు తప్పవు: ఈటల