ETV Bharat / state

Protocol conflict: చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం

author img

By

Published : Sep 26, 2021, 4:30 PM IST

ముషీరాబాద్​ నియోజకవర్గంలో తెరాస, భాజపా నాయకుల మధ్య వివాదం రేగింది. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం (Protocol conflict) చెలరేగింది.

Protocol conflict
చాకలి ఐలమ్మ

చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో (Chakali Ilamma Jayanthi) భాజపా, తెరాస మధ్య ప్రోటోకాల్ వివాదం రేగింది. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో గులాబీ, కమలం పార్టీ నాయకుల వాగ్వాదంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

హైదరాబాద్ లోయర్ ట్యాంక్​బండ్​లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్ (Mla Muta Gopal)... ఫొటో లేకపోవడం వల్ల తెరాస నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్పొరేటర్ రచన శ్రీ.. ఫొటో కూడా లేదని భాజపా నాయకులు అధికారులను నిలదీశారు.

విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్ (Collector Sharman) కలగజేసుకుని వెంటనే ఫ్లెక్సీపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫొటోను సిబ్బంది చేత ఏర్పాటు చేయించారు. అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి గొడవలు జరగకూడదని తెరాస, భాజపా శ్రేణులను ఆయన శాంతింపచేయగా కార్యక్రమం సజావుగా సాగింది.

ఇదీ చదవండి: bandi sanjay letter to kcr: మంత్రివర్గంలో వారికి అవకాశమివ్వాల్సిందే.. కేసీఆర్​కు బండి సంజయ్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.