హైదరాబాద్ కొంపల్లిలో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఎన్నో దాన ధర్మాలు చేసిన అశోక్ గజపతిని ధర్మకర్త పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. ఒక గొప్ప వ్యక్తిని వెల్లంపల్లి శ్రీనివాస్ అవమానించేలా మాట్లాడారని.. వెంటనే గజపతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీలోని ప్రతి క్షత్రియుడు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ వెంటనే స్పందించి శ్రీనివాస్‌ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయలకతీతంగా అధికారపక్షం, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: వెలుగులోకి వచ్చిన ఖమ్మం తోగు కోట