భైంసా అల్లర్లు, లవ్ జీహాదీలకు నిరసనగా భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు... డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. భైంసా ఘటనలో పోలీసులు హిందువులపై కక్షపూరితంగా వ్యవహరించారంటూ.. భజరంగ్‌దళ్ నేతలు ఆరోపించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్తత అనంతరం... నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భైంసా అల్లర్లను, లవ్ జిహాదీలను నివారించలేని రాష్ట్ర ప్రభుత్వం.. తమను అక్రమంగా అరెస్టు చేయడాన్ని కార్యకర్తలు ఖండించారు.
ఇదీ చదవండి: కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి: రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్