ETV Bharat / state

గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: భాజపా - bjp latest news

హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద యుగ తులసి ఫౌండేషన్... గోమాతను రక్షించాలంటూ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో భాజపా నేత పెద్దిరెడ్డి పాల్గొన్నారు. గోమాతన జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు.

cow
'గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి'
author img

By

Published : Dec 21, 2020, 3:10 PM IST

గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని భాజపా నేత పెద్దిరెడ్డి పేర్కొన్నారు. భూమాతతో సమానంగా గోమాతను పూజించడం ధర్మమని ఆయన పేర్కొన్నారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే చట్టాలు తేవాలని కోరారు. గోవధను నిషేందించాలని డిమాండ్​ చేశారు.

హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద యుగ తులసి ఫౌండేషన్... గోమాతను రక్షించాలంటూ చేపట్టిన ధర్నాలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా శాసనసభల్లో గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేందుకు తీర్మానం చేయాలన్నారు.

గోమాతను రక్షించుకునేందుకు జనవరి 8న విజయవాడ హైవేపై 'సడఖ్‌ బంద్‌' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షుడు శివకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో గోశాలలు నిర్మించాలని శివకుమార్ డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాలకు గోవులు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీలు, మఠాధిపతులు మౌనం వీడి బయటకు వచ్చి గోవుల రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.