జీహెచ్ఎంసీ ప్రజలకు ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. కంటోన్మెంట్ నియోజకవర్గం విషయంలో వివక్ష చూపిస్తోందని భాజపా నాయకుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతవాసులకూ ఉచిత నీటి సరఫరా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కార్ఖానా చౌరస్తా వద్ద మహిళలు ఖాళీ బిందెలతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
"కంటోన్మెంట్ ప్రాంతంలో నీటి కోసం మహిళలు రోడ్డెక్కారంటే కేసీఆర్ తలదించుకోవాలి. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో తెరాస తీరని అన్యాయం చేస్తోంది."
-మోత్కుపల్లి నర్సింహులు, భాజపా నాయకుడు
"కంటోన్మెంట్ ప్రజల నీటి బకాయిలను వెంటనే రద్దు చేయాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భాజాపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్ ఈ ప్రాంత నీటి సమస్యపై తెరాస ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష గురించి ప్రశ్నిస్తారు. కంటోన్మెంట్‌కు రావలసిన నిధులతోపాటు హక్కులను కల్పించాలి. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం."
-రామకృష్ణ, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు
ఇదీ చూడండి: రుణ యాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురు అరెస్టు