ETV Bharat / state

నిష్పక్షపాతంగా పరిహారం ఇవ్వాలి: ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు

author img

By

Published : Oct 31, 2020, 12:07 PM IST

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాల వల్ల సర్వం కోల్పోయిన వారందరికి పరిహారం ఇవ్వాలంటూ తెజస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వర్​రావు డిమాండ్ చేశారు. తక్షణ సాయం కింద పదివేల రూపాయలు అందిచండాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

professor vishweswarrao demands to give flood help to all people
నిష్పక్షపాతంగా నష్ట పరిహారం ఇవ్వాలి: ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌రావు

హైదరాబాద్​లో వరద బాధితులందరికి నిష్పక్షపాతంగా సాయం అందించాలని తెజస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వర్​రావు డిమాండ్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పదివేలు సాయం చేయడం సంతోషకర విషయమన్నారు.

వరద సాయం కొన్ని కాలనీల ప్రజలకు అందడంలేదని అన్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం అందరికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన విధివిధినాలు వెంటనే ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ విద్యపై కేటాయింపులు తగ్గిపోతున్నాయ్​: సెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.